మీ గీజర్ ఆయుష్షును పెంచేందుకు ప్రభావవంతమైన సూచనలు

గీజర్‌ మీ ఇంట్లో అత్యంత తరచుగా ఉపయోగించే విద్యుత్తు ఉపకరణాల్లో ఒకటి. ఇది ఎక్కువ కాలం పనిచేసేలా చూసేందుకు ఈ సరళ సూచనలు పాటించండి.

వ్యాసం నవీకరించబడింది

Effective Tips to Enhance the Lifespan of Your Geyser

మీ రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించే ఉపకరణాల్లో బహుశా గీజర్‌ ఒకటి.

ఇది త్వరలోనే అరిగిపోతుందని మీరు చింతిస్తుంటే, రిలాక్స్‌ అవ్వండి. మీరు గీజర్‌ ఆయుష్షును ఎలా పెంచవచ్చనే విషయంపై కొన్ని సరళమైన ప్రభావవంతమైన చిట్కాలతో మీరు దానిని ఎలా జాగ్రత్తగా చూసుకోవచ్చో మేము మీకు చూపిస్తాము.

దీన్ని ప్రారంభిద్దాం.

మీ గీజర్‌లో ఏదైనా సమస్య ఏర్పడితే మరియు దానిని పరిష్కరించలేకపోతే చింతించకండి. నిపుణుడికి కాల్‌ చేయడం ఉత్తమం.

1) ప్లగ్‌ని పరీక్షించండి

అప్పుడప్పుడూ మీ గీజర్‌ ప్లగ్‌ స్థితిని పరీక్షించండి. కరెంటు హెచ్చుతగ్గుల వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదాన్ని తగ్గించేందుకు, రెగ్యులర్‌ వాటికి బదులుగా ఎంసిబి (మినియేచర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌) స్విచ్‌ ఉపయోగించండి, ఎందుకంటే ఇవి సర్క్యూట్‌లో కరెంటు ప్రవాహాన్ని బ్యాలెన్స్‌ చేస్తాయి కాబట్టి. మీ గీజర్‌ నిలకడగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

2) వాల్వ్‌లను పరీక్షించండి

సంవత్సరానికి ఒకసారి, ఉష్ణోగ్రత మరియు ప్రెషర్‌ - విడుదల వాల్వులను పరీక్షించండి. ఇవి మీకు మీ గీజర్‌ అడుగున కనిపిస్తాయి. ఏవైనా లీకేజ్‌లు ఉంటే, వాటిని మార్చండి. అవసరమైతే నిపుణుడి సహాయం తీసుకోండి.

3) ఉష్ణోగ్రతను పరీక్షించండి

గీజర్‌కి అనుకూలమైన ఉష్ణోగ్రత 55 మరియు 65 డిగ్రీల సి మధ్య ఉండొచ్చు. తక్కువ ఉష్ణోగ్రత సెట్టింగును పరిగణించండి, ఎందుకంటే ఇది కరెంటు తక్కువగా వాడుతుంది మరియు మీ కరెంటు బిల్లులను తగ్గించడానికి సహాయపడుతుంది.

4) స్విచ్‌ని పరీక్షించండి

మీ గీజర్‌ స్విచ్‌ని ఎక్కువ సమయం ఆన్‌లో ఉంచడం దాని ఆయుర్దాన్ని తగ్గించగలదు. మీరు దీనిని ఉపయోగించడం ప్రారంభించడానికి అయిదు నిమిషాల ముందు మాత్రమే స్విచాన్‌ చేయండి.

మీకు అర్థమై ఉంటుందనుకుంటా! చిన్న, జాగ్రత్త చర్యలు మీ గీజర్‌ ఆయుర్దాయాన్ని గణనీయంగా పెంచగలవు. ఈ ప్రభావవంతమైన సూచనలు ప్రయత్నించండి మరియు మాకు తరువాత ధన్యవాదాలు తెలియజేయండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది