మీ బాత్రూమ్లో పూడుకుపోయిన డ్రెయిన్లు, లీక్ అవుతున్న కొళాయిలు మరియు తుప్పుపట్టిన ఫౌసెట్ల గురించి మీరు చింతిస్తున్నారా? ఇలాంటి సమస్యలు ఏ సమయంలోనైనా మీకు కలగవచ్చు. చింతించకండి, మేము మిమ్మల్ని కాపాడగలము. ఈ కింద పేర్కొన్నవి కొన్ని సులభ సూచనలు, ఇవి ఈ సమస్యలు పరిష్కరించగలవు.
- Home
- బాత్ రూమ్ క్లీనింగ్
- బాత్రూమ్ ఇబ్బందులు మీకు చికాకులు కలిగిస్తున్నాయా? ఈ సమస్యకు పరిష్కారం ఉంది!
బాత్రూమ్ ఇబ్బందులు మీకు చికాకులు కలిగిస్తున్నాయా? ఈ సమస్యకు పరిష్కారం ఉంది!
మీ బాత్రూమ్ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నారా? తక్కువ సమయంలో వాటిని పరిష్కరించేందుకు ఉత్తమ మార్గాలను ఇక్కడ ఇస్తున్నాము!
వ్యాసం నవీకరించబడింది
పంచుకోండి
1) పూడుకుపోయిన డ్రెయిన్లకు
½ గిన్నె వినిగర్ మరియు ½ గిన్నె వేడి నీళ్ళ మిశ్రమం తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని డ్రెయిన్లో పోసి మూత పెట్టండి. 10 నిమిషాల సేపు వేచివుండి, ద్రావకాన్ని పని చేయనివ్వండి. 10 నిమిషాల తరువాత, మరొక గిన్నె మరగకాచిన నీటిని పోసి మ్యాజిక్ మాదిరిగా డ్రెయిన్ పూడిక తొలగిపోవడం గమనించండి.
2) తుప్పుపట్టిన ఫౌసెట్లకు
నిమ్మకాయను 2 సగాలుగా కోసి, 1 తీసుకొని తుప్పు పట్టిన ఫౌసెట్పై తుడవండి. దానిని కొద్ది సేపు అలా ఉంచండి. తరువాత, కొద్దిగా ఉప్పు మరియు నిమ్మ రసం దానిపై చల్లి తుప్పు పట్టిన ప్రాంతానికి సమంగా ఆచ్ఛాదన కల్పించి 2-3 గంటల సేపు వేచివుండండి. తుప్పు వదలగొట్టేందుకు ఇప్పుడు నిమ్మ బద్దను ఫౌసెట్పై బాగా రుద్దండి.
3) లీక్ అవుతున్న కొళాయిలకు
తయారీదారుని మాన్యువల్ని చదివి కొళాయి జాయింట్ విప్పండి. అనంతరం దానిని 1 కప్పు చొప్పున వేడి నీరు మరియు నిమ్మ రసం మిశ్రమంలో ముంచండి. అనంతరం దీనిని పరిశుభ్రమైన వస్త్రంతో తుడిచి కొళాయిని జాగ్రత్తగా తిరిగి బిగించండి. అవసరమైతే నిపుణుడి సహాయం తీసుకోండి.
మీకు అర్థమై ఉంటుంది: మీ బాత్రూమ్ సమస్యలను పరిష్కరించేందుకు సరళమైన మరియు ప్రభావవంతమైన సూచనలు.
బాత్రూమ్ డ్రెయిన్ పూడుకుపోవడం మీకు నిస్ఫృహ కలిగించడమే కాకుండా, ఇది మీ పైపులకు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు మరియు పెద్ద సమస్యలు కలిగించవచ్చు. ఈ సరళమైన సూచనలు ప్రయత్నించండి మరియు ఆ సమస్యలను పారదోలండి.
వ్యాసం మొదట ప్రచురించబడింది