మీ అమ్మ మీకు ఇచ్చిన చీరలు సదా మీ మనసుకు చేరువగా ఉంటాయి. ఈ చీరలను జాగ్రత్తగా కాపాడుకునేందుకు మరియు అవి ఎక్కువ కాలం ఉండేలా చూసేందుకు మీరు కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి వెనుకాడరు. ఈ విషయం మాకు అర్థమైంది!
చీరల యొక్క విభిన్న ఫ్యాబ్రిక్స్ ని సుదీర్ఘ కాలం పాటు ఉండిపోయేలా చేసేందుకు మరియు భద్రపరిచేందుకు ఈ సూచనలు మీకు సహాయపడతాయి.
ఇస్త్రీచేయుట
తక్కువ వేడి సెట్టింగులో మీ కాటన్ చీరలకు ఇస్త్రీ చేయండి మరియు వాటిని ప్లాస్టిక్ జిప్పర్బ్యాగులో పెట్టండి లేదా వాటిని పరిశుభ్రమైన దుపట్టాలో చుట్టడానికి ప్రయత్నించండి మరియు మడతలు పడకుండా ఉండేందుకు పెద్ద, లూజు ముడి వేయండి.
నిల్వచేయుట
మీ ముదురు రంగు కాటన్ చీరలను లైట్ రంగు చీరలతో కలిపి నిల్వచేయకండి. కొన్నిసార్లు అవశేష తేమ కారణంగా, రంగు ఇంప్రింట్ ప్రభావితం కావచ్చు.
గంజిపెట్టుట
మీ చీరలకు ఎల్లప్పుడూ గంజిపెట్టాలని గుర్తుంచుకోండి మరియు అమితంగా గంజి మీ చీరల ఫ్యాబ్రిక్‌ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.
ఉతకడం
మీరు ఇంటి వద్ద మీ కాటన్ చీరలు ఉతుకుతుంటే, ఎల్లప్పుడూ మైల్డ్ డిటర్జెంట్ ఉపయోగించండి.
నిల్వచేయుట
మీ సిల్క్ చీరలను ఇతర ఫ్యాబ్రిక్స్‌తో తయారు చేసిన చీరలతో నిల్వ చేయకండి ఎందుకంటే ఇది ఉభయ ఫ్యాబ్రిక్స్‌ని పాడు చేయవచ్చు. వాటిని ఎల్లప్పుడూ నేరుగా ఎండ తగలకుండా నిల్వ చేయాలని గుర్తుంచుకోండి. వాటిని చల్లని మరియు తేమలేని స్థలంలో నిల్వ చేయండి.
ప్లాస్టిక్ కవర్‌కి నో చెప్పండి
ఏదైనా ప్లాస్టిక్ కవర్ని తొలగించండి ఎందుకంటే ఇది జరీ పని లేదా వస్త్రం రంగు వెలసిపోవడానికి దారితీయొచ్చు.
చుట్టడం
ఎల్లప్పుడూ భారీ చీరలను పాత దుపట్టాల్లో లేదా పరిశుభ్రమైన టవల్స్‌లో చుట్టండి.
ఉతకడం
మీరు మీ చీరలను ఇంటి వద్ద ఉతుకుతుంటే, సిల్క్‌కి అనుగుణమైన మైల్డ్ డిటర్జెంట్‌ని ఉపయోగించండి.
పరిపూర్ణమైన మెటీరియల్, ట్రెండీ డిజైన్, ఉత్తమ రంగు మరియు అబ్బురపరిచే టెక్చర్ గల మీ అందమైన చీరలకు ప్రత్యేక సంరక్షణ అవసరం. ఆ ఖరీదైన చీరలను కాపాడే విషయానికొస్తే ఈ సూచనలు పెద్ద తేడా తీసుకురాగలవు.