కర్టెన్లు మీ జీవింలో అంతర్గత భాగంగా ఉంటాయి. జాగ్రత్తగా ఎంచుకున్నప్పుడు, ఇవి మీ ఇంటి అందాన్ని చాలా వరకు పెంచుతాయి. అయితే, నిరంతరం ఎండ తగలడం వల్ల, వాటి ప్రకాశం తగ్గడం ప్రారంభమవుతుంది మరియు బహుశా ఫ్యాబ్రిక్ కుంగిపోవడం కూడా కలగవచ్చు.
ప్రశాంతంగా ఉండండి, చింతించవలసిన పని లేదు. శుభ వార్త ఏమిటంటే, మేము మిమ్మల్ని కాపాడగలము. ఎండ వల్ల కలిగే నష్టం నుంచి మీ కర్టెన్లను కాపాడుకునేందుకు ఈ సులభ పద్ధతి పాటించండి.
స్టెప్ 1:
కర్టెన్లను జాగ్రతగా తొలగించండి. వీటికి గట్టి వస్తువులు ఏవి పెట్టలేదని నిర్థారించుకోండి. ఇప్పుడు వీటిని ఫ్లాట్ ఉపరితలంపై పరవండి.
స్టెప్ 2:
వ్యాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించి లూజు దుమ్ము మరియు మురికి ఏదైనా ఉంటే పోగొట్టండి.
స్టెప్ 3:
మెషీన్లో ఉతకవలసిందిగా తయారీదారుని లేబుల్‌లో సిఫారసుచేస్తే, మీ కర్టెన్లను వాషింగ్ మిషనులో వేసి, జెంటిల్, కోల్డ్ సైకిల్లో వాష్ చేయండి. మీకు నచ్చిన 3 చిన్న చెంచాల డిటర్జెంట్‌ని నేరుగా డ్రమ్ములో వేసి సైకిల్ని రన్ చేయండి. ఒకవేళ చేతి ఉతుకు చేయవలసిందిగా లేబుల్‌లో చెబితే, 1 బక్కెట్ నీటికి 2 చిన్న చెంచాల డిటర్జెంట్ కలిపి సౌమ్యంగా చేతులతో ఉతకండి. ఎల్లప్పుడూ ఒకసారి ఒక ప్యానల్‌ని ఉతకండి.
స్టెప్ 4:
మీ కర్టెన్లను గాలికి ఆరబెట్టండి.
మీ కర్టెన్లను తగిన స్థితిలో ఉంచండి, నెలకు ఒకసారి వాటిని డ్రైయర్ గుండా రన్ చేయండి.
దుమ్ము మరియు మురికిని తొలగించడానికి ఇది సహాయపడుతుంది. ‘‘నో హీట్’’ సెట్టింగును ఉపయోగించి 10 నిమిషాల సేపు వాటిని డ్రై చేయండి.
కర్టెన్ల రంగు వెలవడాన్ని నిరోధించడం కష్టమేమీ కాదు. పైన ఇవ్వబడిన వాషింగ్ మరియు నిర్వహణ టెక్నిక్లను పాటించడం ద్వారా మీరు దీని ఆయుర్దాన్ని సులభంగా పెంచవచ్చు.
ఉజ్వలమైన మరియు దుమ్ము రహిత కర్టెన్ల కోసం మీ ఇంటి టోన్‌ని సెట్ చేయండి.
కీలక స్టెప్
మీ కర్టెన్లను తగిన స్థితిలో ఉంచేందుకు 6 నెలలకు ఒకసారి వాటిని డ్రై క్లీనింగ్ చేయించండి.