మీ సిల్క్ టైలని ఎలా జాగ్రత్త పరచుకోవాలో మీరు తెలుసుకోవాలి

ఒక సిల్క్ టై అనేది ఒక జెంటిల్‌మెన్ యొక్క విశిష్టతకు గుర్తింపు, బోర్డ్‌ రూంలో మరియు ఫార్మల్ ఫంక్షన్లలో ఘనంగా ఉండేందుకు వేసుకుంటారు. ఈ సులువైన చిట్కాలని పాటించిఈ లగ్జరీ దుస్తులని చేత్తో ఉతికి శుభ్రపరచుకోండి.

వ్యాసం నవీకరించబడింది

All You Need to Know About Maintaining Your Silk Ties

సిల్క్ అనేది ఒక సున్నితమైన వస్త్రం దీనికి సరైన సంరక్షణ అవసరం.  ఎలాగైనా మహిళలు తమ పట్టు చీరలని జాగ్రత్తగా ఉంచుకుంటారో, మగవారు కూడా, తమ విలువైన సిల్క్ టైలని తర్వాతి తరానికి అందిస్తారు.  మీరు చేయవలసిందల్లా కొన్ని సాధారణ  చిట్కాలని పాటించి వాటిని జాగ్రత్తపరచుకోండి.

1) మరకలని తొలగించడానికి

ఎల్లపుడూ గుర్తుంచుకోండి, శుభ్రమైన బట్టతో మరకలని తొలగించాలి.  ఏ పరిస్థితిలోనైనా, మరక ఉన్న చోట రుద్దకూడదు, అలా చేయడం వల్ల మరక మరింత వ్యాపిస్తుంది, దాన్ని తొలగించడం మరింత కష్టమవుతుంది.  మరక నూనె లేదా గ్రీజ్‌ది అయితే, కొద్దిగా టాల్కమ్ పౌడర్‌ని మరకపై వేసి, రాత్రంతా అలాగే ఉండనివ్వాలి.  ఇప్పుడు, మృధువుగా బ్రష్‌తో టాల్కం పౌడరుని శుభ్రమైన పొడి బట్టతో తొలగించాలి. వస్త్రంపై మరక తొలగించబడుతుంది.  ఒకవేళ తొలగకపోతే, ఈ ప్రక్రియని మళ్ళీ చేయండి.

2) జాడించడానికి

మీ సిల్క్ టైలని డ్రై క్లీనింగ్ చేయిస్తే మంచిది.  అయితే, మీ టైని చేత్తోనే ఇస్త్రీ చేయాలని మీ క్లీనర్లకు ఖచ్చితంగా సూచించడం మంచిది, ఇలా చేయడం వల్ల అంచులు చుట్టుకుపోవు. తేలికపాటి డిటర్జెంట్‌తోచల్లని నీటిని ఉపయోగించి మీ టైని మీరు చేత్తో ఉతుక్కోవచ్చు, వేడి నీరు ఫాబ్రిక్‌ని పాడు చేస్తుంది.  మీ సిల్క్ టైని ఎండలో తిన్నగా ఆరబెట్టకండి, దాని వల్ల వెలిసిపోవచ్చు.

3) ముడతలని తొలగించడానికి

హ్యాండ్ స్టీమర్‌ని ఉపయోగించి  మీ సిల్క్ టైల ముడతలని తొలగించడం  ఉత్తమ మార్గాలలో ఒకటి.  ముడతలు మాయం.  మరో విధంగా, ముడతలని ఇస్త్రీ చేయ్వచ్చు.  ఇలా చేయడానికి మీ సిల్క్ టై క్రింది మరియు పైన తువ్వాలును పెట్టాలి.  తువ్వాలుపై కొద్ది చుక్కల నీటిని చల్లండి.  మీ ఇస్త్రీని తక్కువ ఉష్ణోగ్రతలో  పెట్టి, మృధువుగా తువ్వాలుని ఇస్త్రీ చేయండి.  కొద్ది నిమిషాలు అలాగే ఉంచి, టైని బయటికి తీయండి.

4) భద్రపరచడం

ఎల్లపుడూ మీ సిల్క్ టైని చల్లని, చీకటి ప్రదేశంలో ఆరబెట్టాలి.  వదులుగా ఉండలుగా చుట్టి క్రీసింగ్ లేకుండా ముడతలు లేకుండా చేసుకోవచ్చు లేదా వాటిని టై రాక్‌లో వేలాడదీయాలి.

ఈ సా‘దారణ చిట్కాలని అనుసరిస్తే మీ టైల చిక్కు ముళ్ళ గత చరిత్ర అయిపోతుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది