మీ ఇష్టమైన కాటన్ కుర్తీ పట్ల మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నారని అది ఎలా తెలుసుకుంటుంది

కాటన్ కుర్తీలు పట్టణ మహిళ యొక్క వార్డ్ రోబ్‌లో ప్రధానమైనవి. ప్రో లాగా వాటిని ఎలా శుభ్రం చేయాలి మరియు భద్రపరిచే విధానం ఇక్కడ సూచించబడింది.

వ్యాసం నవీకరించబడింది

How Do You Let Your Favourite Cotton Kurti Know That You Really Care for It

కాటన్  కుర్తీ భారతదేశంలో వేసవిలో తరచుగా వాడే వస్త్రం. కానీ సున్నితమైన వస్త్రం కావడంతో, కాటన్ కి కొన్ని అదనపు జాగ్రత్తలు అవసరం. ఈ వ్యాసంలో మీ కాటన్  కుర్తీ నుండి ఏవైనా మరకలు ఉంటే ఎలా శుభ్రం చేయాలో మీకు తెలియజేస్తాము మరియు కొన్ని అద్భుతమైన సంరక్షణ చిట్కాలను వివరిస్తాము.

1) ఉప్పు నీటిలో నానబెట్టండి

మీరు మీ కాటన్  కుర్తీ రంగును కాపాడుకోవాలనుకుంటే, ఉతుక్కోవడానికి ముందు ఎప్పుడూ నానబెట్టండి. ఒక బకెట్  చల్లటి నీటిలో 1 చిన్న చెంచా కల్లు ఉప్పు కలపాలి. అందులో ఒక గంట నానబెట్టి, ఆపై చేతితో ఉతుక్కోవాలి.

2) మైల్డ్ డిటర్జెంట్ వాడండి

కాటన్  సున్నితమైన వస్త్రం కాబట్టి దీనికి తేలికపాటి డిటర్జెంట్ అవసరం. మీరు సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ఉపయోగించి ప్రయత్నించవచ్చు.

3) చల్లటి నీటితో కడగాలి

మీ కాటన్  కుర్తిని చల్లటి నీటితో ఉతుక్కోవాలని మేము సూచిస్తున్నాము. ఈ విషయంలో వేడి నీళ్ళు వద్దు అనే చెప్పాలి ఎందుకంటే ఇది రంగును మసకబారుస్తుంది మరియు బట్ట కుంచించుకొని పోయేలా చేస్తుంది.

4) ఎండలో ఆరబెట్టవద్దు

మీ కాటన్  కుర్తిని నీడ ఉన్న చోట గాలికి ఆరబెట్టాలని మేము సూచిస్తున్నాము. సూర్యరశ్మికి ప్రత్యక్షంగా గురికాకుండా చూసుకోండి. ఇస్త్రీ చేసేటప్పుడు, వస్త్రం క్రింద మరియు పైన రక్షణ పొరను ఉంచండి. మీరు కాటన్ తువ్వాళ్లను ఉపయోగించవచ్చు. అలాగే ప్రత్యేక్ష ఎండకు కాటన్ బట్ట దెబ్బతింటుంది కాబట్టి వేడికి గురికాకుండా  చూసుకోండి.

అలాగే, మీ కాటన్ కుర్తీ ముడతలు లేకుండా ఉండటానికి, ఉతికిన తర్వాత సున్నితంగా సాగదీయండి, అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత. ఇది ముడతలు లేకుండా చేస్తుంది మరియు ఇస్త్రీ కూడా అవసరం లేకపోవచ్చును! వాష్ కేర్ సూచనల కోసం సంరక్షణ లేబుల్‌ను తనిఖీ చేయడం మరియు వాటిని అనుసరించడం చాలా ముఖ్యం.

ఈ చిట్కాలు మీ కాటన్  కుర్తిని తాజాదనం కలిగించే స్థితిలో ఉంచుతాయి.

వ్యాసం మొదట ప్రచురించబడింది