చొక్కాలు అనేవి బిజినెస్ మీటింగ్స్ మరియు ఇంటర్వ్యూలకు ప్రత్యేక డ్రెస్ కోడ్. మీరు విజయం కొరకు దుస్తులు ధరించాలనుకుంటే మీ దుస్తులు పరిమళించేలా నిర్ధారించుకోండి. ఇది చాలా సులువు. మీ శుభ్రపరిచే విధానంలో కొద్ది మార్పులు చేసుకుంటే చాలు.
మీ ఫార్మల్ చొక్కాలని పరిమళించేలా చేసుకోడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
1) సెంటు కలిపిన నూనెలను వాడండి
మీకిష్టమైన ఎస్సెన్షియల్ ఆయిల్‌ని వాషింగ్ మెషీన్లో వాష్ సైకిల్ని మొదలుపెట్టే ముందు వేయాలి
2) మీ డ్రైయర్‌కు సువాసనలను జోడించండి
తువ్వాలుని తీసుకుని నీటిలో నానబెట్టండి. తువ్వాలులో ఉన్న ఎక్కువ నీటిని పిండేయండి. ఇప్పుడు మీకు నచ్చిన ఎస్సెన్షియల్ ఆయిల్‌ని తువ్వాలుపై 6-7 చుక్కలు వేయండి. ఇప్పుడు, మీ దానిని డ్రైయర్స్ లోడ్‌లో చేర్చండి. సెంట్ మీ ఫార్మల్ చొక్కాలని చేరుతుంది.
3) మీ చొక్కాలని పూర్తిగా ఆరనివ్వండి.
మీ చొక్కాలో బూజు దుర్వాసనని కలిగించవచ్చును. మడతపెట్టే ముందు మీ చొక్కాలు పూర్తిగా ఎండిపోయాయని నిర్ధారించుకుని భద్రపరచండి.
4) మీ మెషీన్‌ని డియోడొరైజ్ చేయండి
మీ దుస్తులని మెషీన్-వాష్ చేస్తే, మీ మెషీన్నే మీ చొక్కాల దుర్వాసనకు కారణం కావచ్చు. మధ్య మధ్యలో డియోడొరైజ్ని మీ వాషింగ్ మెషీన్లో వేయాలి. మీరు చేయవలసిందల్లా మీ మెషీన్ డ్రమ్‌ని వేడి నీటితో నిండేలా చేయాలి. 2కప్పుల వైట్ వెనీగర్ని వేసి30 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇప్పుడు, నార్మల్ వాష్ సైకిల్ని ఏ బట్టలు వేయకుండా నడపాలి.
5) మీ వాషర్లో గాలిని బయటికి వచ్చేలా చేయాలి
గుర్తుంచుకోండి, తడితనం మరియు నీడలో ఆరేయడం వల్ల బూజు పట్టచ్చు. కనుక, ఎప్పుడూ మీ డ్రైయర్‌ని ఖాళీ చేసాక గాలి ప్రసరించేలా ఉంచాలి. కొద్దిసేపు గాలి వచ్చేలా మూతని తెరిచి ఉంచి పూర్తిగా ఆరనివ్వాలి.
ఇలా చేయడం చాలా సులువు. ఈ సాధారణ చిట్కాలని అనుసరించి మీ ఫార్మల్ చొక్కాలకు తగిన చికిత్స చేసి భద్రపరచుకోండి. పరిమళించండి, మంచి అనుభూతిని పొందండి.