పార్టీకి వెళ్ళడమంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ప్రజలకు నచ్చనిదల్లా ఆహారం లేదా వైన్ వాళ్ళ దుస్తులపై చిందిపడడమే. అయితే, పొరబాటున ఆహారం దుస్తులపై పడటం ఎప్పుడో ఒకప్పుడు జరగడం తథ్యం. కానీ, మీకు ఇష్టమైన డ్రెస్ మీ స్ఫూర్తిని పాడుచేయడనివ్వకండి. మీకు కనిపించిన వెంటనే మరకను శుభ్రం చేయడం ముఖ్యం. కాస్త ఇటు అటుగా, శుభ్రం చేసే టెక్నిక్ విభిన్న రకాల మరకలకు చాలా వరకు ఒకేలా ఉంటుంది. అయితే, మరకలో ఉన్న ప్రధాన భాగంపై ఆధారపడి, మీరు ప్రక్రియను కొద్దిగా మార్చవలసి ఉంటుంది.
ఇక్కడ మనం చేద్దాం!
1. నూనె మరియు బటర్ వెన్న మరకలను తొలగించుట
మరకకు ఇరు వైపులా కొద్దిగా పిండి, టాల్కమ్ పౌడర్ మరియు మొక్కజొన్న పిండిని చల్లండి మరియు 30 నిమిషాల సేపు దానిని మరకపై ఉంచండి. పౌడరును విదిలించి అక్కడ మరక ఇంకా ఉందా అనే విషయం చూడండి. ఒకవేళ ఉంటే, దానిపై కొద్దిగా మైల్డ్ డిష్‌వాషింగ్ జెల్‌తో మెల్లగా రుద్దండి మరియు గోరువెచ్చని నీటి కింద కడగండి.
2. తేయాకు మరియు కాఫీ మరకలను తొలగించుట
2 చిన్న చెంచాల వినిగర్ ద్రావణాన్ని ని ½ బౌల్ నీటిలో మిశ్రమం చేయండి. మరకలు పడిన ప్రాంతంపై ఈ ద్రావణం మెల్లగా చల్లి కడగండి. మరక పోయేంత వరకు ప్రక్రియను తిరిగిచేయండి.
3. కెచ్అప్ మరకలను తొలగించుట
మరకలుపడిన గార్మెంట్‌ని చల్లని కొళాయి నీటి కింద కడగండి. తరువాత దానిపై కొద్దిగా వినిగర్ రుద్దండి. మీరు మీ ఉతకవలసిన కుప్పకు గార్మెంట్‌ని కలపడానికి ముందు, మరకలు పడిన మచ్చపై కొద్దిగా డైల్యూటెడ్ ద్రావణం రాయండి.
4. రెడ్ వైన్ మరకలను పోగొట్టండి
2 చిన్న చెంచాల వినిగర్ మరియు ½ కప్పు రబ్బింగ్ ఆల్కహాల్‌ని (లేదా హ్యాండ్ శానిటైజర్) బౌల్లో మిశ్రమం తయారు చేయండి. వస్త్రాన్ని ఈ మిశ్రమంలో ముంచి మరకలు తుడవండి. ద్రవం సంగ్రహించబడేంత వరకు తుడుస్తూనే ఉండండి, అంతే మరకలు పోతాయి. తరువాత, మీ రెగ్యులర్ వాష్ సైకిల్లో మీరు చేసినట్లుగా ఉతకండి.
ఈ తెలివైన మరియు ప్రభావవంతమైన శుభ్రపరచే మెళకువలతో, చింతించకుండా మీరు మీ పార్టీని ఆనందించవచ్చు.