మీరు విడిచిన బట్టలను శుభ్రంచేసేందుకు వాటిని వాషింగ్ మెషీన్లో వేస్తుంటారు. ప్రతి ఉతుకు తరువాత వాటి రంగు వెలసిపోతోందని మీరు గమనిస్తే ఏం చేస్తారు? భయపడకండి, ఈ విషయంలో మీకు సహాయపడేందుకు మేమున్నాము!
మీ బట్టల లేబుల్స్‌పై ఇచ్చిన తేలికపాటి సూచనలను విస్మరిస్తూ మీరు ఒక కప్పు డిటర్జెంట్ వేసి వాటిని వాషింగ్ మెషీన్లో ఉతికేస్తూ ఉంటారు. దీనివల్ల మీ దుస్తులకు నష్టం వాటిల్లుతుంది. రంగు వెలవకుండా ఉండాలంటే, మీరు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి.
1) ట్యాగ్‌ని జాగ్రత్తగా చదవాలి
మీ దుస్తులను ఎలా ఉతకాలో నిర్ణయించుకునే ముందు ఎల్లప్పుడూ వాటిపై గల ట్యాగ్‌ని చూడాలి. దుస్తులపై ఇచ్చిన వాషింగ్ మరియు ఇస్త్రీ సూచనలను పాటించండి. మీరు సరైన లాండ్రీ ప్రక్రియను పాటించడం ముఖ్యం.
2) చల్లని నీటిని ఉపయోగించండి
గోరువెచ్చని నీరు వస్త్రాలను బలహీనపరుస్తుంది. కాబట్టి, మీ దుస్తులు ఉతకడానికి చల్లని నీరు ఉపయోగించండి. దుస్తుల రంగు పోవడాన్ని కూడా చల్లని నీరు నిరోధిస్తుంది.
3) మీ దుస్తులను వేరు చేయండి
రంగుల వారీగా మీ దుస్తులు వేరు చేయండి. ఒకే రంగులు గల దుస్తులను కలిపి ఉతకడం రంగులు వెలవకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
4) మీ డిటర్జెంట్‌ని జాగ్రత్తగా ఎంచుకోండి
రంగు దుస్తుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన డిటర్జెంట్లు ఉపయోగించండి. ఇవి దుస్తుల రంగు వెలవకుండా వాటికి అంటుకొనివుండేందుకు రూపొందించబడ్డాయి. మీ దుస్తులను మెత్తగా మరియు సువాసనతో ఉండేలా చేసేందుకు మీరు ఫ్యాబ్రిక్ కండిషనర్‌ని కూడా ఉపయోగించవచ్చు.
5) మెషీన్ గైడ్‌ని చదవండి
ఎప్పుడూ లోడ్‌ని హెవీ, వేడి-నీటి సైకిల్లో నడపకండి. సౌమ్యమైన సెట్టింగ్ సిఫారసు చేయబడుతోంది.
ఇది చాలా సులభం మరియు సరళం!