కాటన్ దుస్తుల కోసం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని తేలికైన చిట్కాలను అనుసరిస్తే, వాటి రంగును సుదీర్ఘ కాలం కాపాడుకోవచ్చు.

1) వీటిని వేడి నీటిలో ఉతకకండి. చల్లని నీరే సరైన ఎంపిక. 

2) మీరు చేతులతో ఉతుకుతుంటే, ఒక బక్కెట్ నీటిలో 2 కప్పుల సర్ఫ్ ఎక్సెల్‌ను వేయండి, మరియు దుస్తులను ఆ నీటిలో ముంచి అటూ ఇటూ తిప్పండి. 5 నుంచి 10 నిమిషాల వరకు దుస్తులను ఆ నీటిలో నాననివ్వండి, ఆ తర్వాత మరో మారు వాటిని అటూ ఇటూ తిప్పండి. వాటిని సున్నితంగా పిండాలని గుర్తు ఉంచుకోండి. 

3) రంగుల ప్రకారం మీ దుస్తులను ఏర్పాటు చేసుకోండి. ముదురు రంగులు గల దుస్తులను, లేత రంగుల వాటితో కలిపి ఉతికితే, మీ బట్టల రంగులు మారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

4) వాషింగ్ మెషీన్‌లో శుభ్రపరుస్తున్న సమయంలో ఒక కప్పు వెనిగర్‌ను వేయండి. ఇది రంగు వెలిసి పోకుండా అడ్డుకుంటుంది మరియు కాటన్ దుస్తుల మెరుపును కాపాడుతుంది. 

5) మీ కాటన్ దుస్తులను నీడలో మాత్రమే ఆరేయండి. నేరుగా ఎండ తగిలేలా ఉంచడం సరైన పద్ధతి కాదు.