కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో మీకు ఇష్టమైన రెస్టారెంట్ లేదా పార్కును సందర్శించాలనుకుంటున్నారా? లాక్ డౌన్ సడలించిన తర్వాత అవసరమైన జాగ్రత్తలు తీసుకోని ఇంటి నుంచి బయట అడుగు పెట్టండి. మీరు బయట విహారించుకోవాలన్న లేదా కుటుంబం, స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకున్న సురక్షితంగా ఉండటం మంచిది. కరోనావైరస్ నుండి రక్షణ పొందడానికి మీరు విశ్రాంతి కార్యకలాపాలను ఆస్వాదించడానికి సరైన భద్రత చర్యలను పాటించడానికి ఈ చిట్కాలను అనుసరించండి.
మీ పరిశోధన చేయండి
మీరు మాల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్ళడానికి ముందు, ఆ ప్రాంతంలోని కోవిడ్ -19 పరిస్థితిపై కొంత పరిశోధన చేయడం మంచిది. ఇది నియంత్రణ జోన్లో ఉందా లేదా కరోనావైరస్ వ్యాప్తి తక్కువగా ఉందా అని చూడటానికి ప్రభుత్వ నవీకరణలను తనిఖీ చేసిన తర్వాత సందర్శించడానికి విశ్రాంతి స్థలాన్ని మీరు ఎంచుకోవచ్చు. అలాగే, సాధ్యమైనంత వరకు ఇండోర్ ప్రదేశాలకు బదులుగా , సామాజిక దూరాన్ని నిర్వహించడానికి సులభంగా ఉండే బహిరంగ ప్రదేశాలను ఎంచుకోండి.
సిడిసి ప్రకారం, మీరు మరియు ఇతరుల మధ్య కనీసం 6 అడుగుల స్థలా దూరాన్ని కొనసాగించగలిగితే మీరు మీ కార్యకలాపాలు సురక్షితం, ఎందుకంటే కోవిడ్-19 ఒకరి నుండి మరొకరు 6 అడుగుల లోపు ఉన్న వ్యక్తుల మధ్య సులభంగా వ్యాపిస్తుంది.
మీ విశ్రాంతి కార్యాచరణను తెలివిగా ఎంచుకోండి
కొన్ని ప్రదేశాలల్లో రెస్టారెంట్ లో ఉన్న కత్తులు, వంట పాత్రలు, గ్లాసులు, క్రోకరీ లాంటి వస్తువులు అందురు పంచుకునేలా నిర్మించబడ్డాయి. క్రిమిసంహారకం చేయని వస్తువులను పంచుకోవడం వల్ల సూక్ష్మక్రిములు మరియు అంటువ్యాధుల సోకే ప్రమాదం ఉంటుంది. విశ్రాంతి కోసం, మాల్స్ లేదా ప్రకృతి ఉద్యానవనాలు లేదా తోటలు మొదలైనవి లాంటివి ఎంచుకోండి అక్కడ పరిమిత భాగస్వామ్యం ఉన్న ప్రదేశాలను ఎంచుకోండి మరియు ఇతరులతో పంచుకోబడిన ఏవైనా వస్తువులు క్షుణ్ణంగా శుభ్రం చేయబడతాయి మరియు వాడిన తరువాత క్రిమిసంహారకమవుతాయి అని నిర్ధారించుకోండి. కోవిడ్ -19 నుండి ఇతరులను రక్షించడానికి వారు ఎలాంటి శుభ్రపరచే చర్యలు మరియు క్రిమిసంహారకం చర్యలను పెంచారో ప్రకటించే స్థలాలను సందర్శించడానికి మీరు ఎంచుకోవచ్చు.
ప్రకటన
మీ విశ్రాంతి సమయాన్ని తెలివిగా ఎంచుకోండి
మీరు రెస్టారెంట్‌కు వెళుతుంటే, వెళ్లేముందు రిజర్వేషన్ చేసుకోండి. మీరు రద్దీగా ఉండే నిరీక్షణ ప్రాంతాలను నివారించవచ్చు. మాల్ లేదా థీమ్ పార్క్ లేదా మరే ఇతర విశ్రాంతి ప్రదేశాల సందర్శన కోసం, ప్రాంగణంలో తక్కువ మంది ఉంటారని మీరు అనుకునే సమయం మరియు రోజును ఎంచుకోండి. ఉదాహరణకు, వారాంతంలో వెళ్లే బదులు, వారపు రోజు మధ్యాహ్నం వెళ్ళండి. ఇటువంటి సాధారణ ప్రణాళికలు వేసుకుంటే మీకు రద్దీ మరియు కరోనావైరస్ నుండి సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఫేస్ మాస్క్ ధరించండి
మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం చాలా ముఖ్యమైన భద్రతా పద్ధతుల్లో ఒకటి. బహిరంగంగా ఉన్నప్పుడు మరియు ప్రత్యేకంగా ఇతరుల నుండి 6 అడుగుల దూరంలో ఉండటం కష్టం అయినప్పుడు మరియు మీ చుట్టుపక్కల ప్రజలు వస్త్రం ముఖ కవచాన్ని ధరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, మీకు తెలిసినట్లుగా, కరోనావైరస్ బారిన పడినవాళ్లు కప్పుకోకుండా తుమ్మిన లేదా దగ్గిన తర్వాత చాలా అడుగుల వరకు వైరస్ ప్రయాణించవచ్చు. అందువల్ల, మీ ఆర్డర్‌ను ఇచ్చేటప్పుడు రెస్టారెంట్లో సేవా సిబ్బందితో లేదా షాపింగ్ అసిస్టెంట్‌తో మాట్లాడేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం మీకు మరియు ఇతర వ్యక్తికి రక్షణ కల్పిస్తుంది.
మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ముసుగును సురక్షితంగా తీసిపారేయడాన్ని మర్చిపోవద్దు. మీ ఫేస్ మాస్క్‌ను ఎలా సురక్షితంగా పారవేయాలో తెలుసుకోవాలంటే, ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి
మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంట్లో మీరు ఉండడం మంచి పని. మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే బయటికి వెళ్ళి కొద్దిగా ఆస్వాదించవచ్చును. బయటికి వెళ్లిన, వెళ్లి వచ్చిన తరువాత మీ చేతులను బాగా కడుక్కోండి. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ వాడండి. మీ కళ్ళు, ముక్కు, నోరు కడుక్కోని చేతులతో తాకడం మానుకోండి.
మీ సరదా సందర్శన అంతా, మీ చేతులను శుభ్రపరచడం కొనసాగించండి. షాపింగ్ ట్రాలీని తాకిన తర్వాత, మీ షాపింగ్ పూర్తి చేసిన తర్వాత, లిఫ్ట్ / ఎస్కలేటర్ ఉపయోగించిన తర్వాత, మెనూ కార్డును తాకిన తర్వాత, తాజాగా వడ్డించే భోజనం తినడానికి ముందు మాస్క్‌ను తొలగించిన తరువాత , వాష్‌రూమ్‌ను ఉపయోగించే ముందు మరియు, అలా చేయండి. మరియు మీ చేతులను సరైన క్రమంలో శుభ్రపరచండి.
బయట ఉన్నప్పుడు సరైన శ్వాసకోశ పరిశుభ్రతను కూడా అనుసరించండి, అనగా మీరు దగ్గిన లేదా తుమ్మిన టిష్యూతో, రుమాలుతో లేదా మోచేయితో కప్పండి. మూసివేసిన డబ్బాలో టిష్యూను వెంటనే పడేయడం మర్చిపోవద్దు.
సురక్షిత దూరాన్ని పాటించండి
ఇతరుల నుండి కనిష్ట 6 అడుగుల దూరం పాటించండి. ఎవరైనా కప్పుకోకుండా తుమ్మిన, దగ్గినా, ఇది మీపై లేదా మీ బట్టలు, బ్యాగ్ మొదలైన వాటిపై కరోనావైరస్ దిగే అవకాశాలను తగ్గిస్తుంది. ఓపెన్-ఎయిర్ రెస్టారెంట్ వంటి బహిరంగ ప్రదేశంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ విశ్రాంతి ప్రదేశాలు ఇచ్చిన సంకేతాలు మరియు ఇతర దృశ్య సూచనలను దూరంగా ఉండటానికి రిమైండర్‌గా ఉపయోగించవచ్చు. నేలపై గుర్తులు, రెస్టారెంట్లో కుర్చీలు ఉంచడం, సైన్‌బోర్డులు మొదలైనవి ఇందులో ఉన్నాయి.
రెస్టారెంట్, మాల్ లేదా పార్క్ ప్లెక్సిగ్లాస్ స్క్రీన్లు లేదా సవరించిన లేఅవుట్లు వంటి భౌతిక అడ్డంకులను అమర్చినట్లయితే , వాటిని సద్వినియోగం చేసుకోండి.
వేరేవారినితాకకుండా ఉండే అనుభవాలను ఎంచుకోండి
భద్రతా ప్రమాణంగా, రెస్టారెంట్లు, హోటళ్ళు, మాల్స్, పార్కులు వారి ప్రక్రియలను ఎక్కువగా కాంటాక్ట్ లేని విధంగా మారుస్తున్నాయి. దాన్ని ఉపయోగించుకోండి. ఉదాహరణకు, నగదును ఉపయోగించకుండా డిజిటల్ వాలెట్లు లేదా నెట్‌బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపులు చేయండి. భౌతిక మెను కార్డ్‌ను ఉపయోగించకుండా డిజిటల్ మెనూ కోసం అడగండి, వీటిని ఎంతోమంది వ్యక్తులు తాకి ఉండవచ్చు. మీ కారును వాలెట్‌కు అప్పగించే బదులు సెల్ఫ్ పార్క్ చేయండి. లిఫ్ట్ బదులు ఎస్కలేటర్లను తీసుకోండి. వారు అందించే ఇతర కాంటాక్ట్‌లెస్ ఎంపికలపై. సర్వీస్ ప్రొవైడర్‌ని అడిగి తెలుసుకోండి.
సురక్షితంగా ప్రయాణం
మీరు మీ వ్యక్తిగత వాహనాన్ని మాల్, రెస్టారెంట్ లేదా ఇతర విశ్రాంతి ప్రదేశాలకు ప్రయాణించడానికి ఉపయోగిస్తుంటే, దాన్ని వాలెట్‌కు అప్పగించకుండా మీరే పార్క్ చేసుకోవడం మంచిది. మీ గమ్యాన్ని చేరుకోవడానికి మీరు టాక్సీ, ఆటోరిక్షా, రైలు లేదా బస్సు వంటి ప్రజా రవాణాను ఉపయోగిస్తుంటే, ఈ భద్రతా చిట్కాలను గుర్తుంచుకోండి.
లాక్డౌన్ తర్వాత మీరు విమాన ప్రయాణాన్ని పరిగణిస్తుంటే, దయచేసి విమానయాన సంస్థలతో తనిఖీ చేయండి మరియు వారి అన్ని మార్గదర్శకాలను అనుసరించండి. అలాగే, అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు నియమాలను అనుసరించండి.
ఈ పరిశుభ్రత అత్యవసర వస్తువులను తీసుకెళ్లండి
మీరు బయటికి వచ్చేటప్పుడు, మీతో కూడ టిష్యూస్, మంచి ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ మరియు ఫేస్ కవరింగ్ తీసుకొని రండి సురక్షితంగా ఆనందించండి. తరుచుగా చేతులు కడుక్కోవడం గుర్తుంచుకోండి పరిశుభ్రంగా ఉండడం కోసం మీరు ఎల్లప్పుడూ సబ్బు మరియు నీరు లేదా శానిటైజర్ వాడండి.
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీరు బయటకు వెళ్ళడానికి ప్రణాళికలు వేస్తున్నప్పుడు ఈ చిట్కాలను గుర్తుంచుకోండి.
మూలం :
https://www.cdc.gov/coronavirus/2019-ncov/daily-life-coping/activities.html
https://www.cdc.gov/coronavirus/2019-ncov/community/cleaning-disinfecting-decision-tool.html
వ్యాసం మొదట ప్రచురించబడింది