మీ శిశువు బట్టలు ఎలా ఉతుక్కోవాలి అని తెలుసుకోవలనుకుంటున్నారా, మీరు సరైన స్థలానికే వచ్చారు. ఈ సమయాల్లో వారికోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి, వారి చర్మం సున్నితమైనది మరియు అంటువ్యాధుల బారిన పడటం చాలా సులువు కాబట్టి వాళ్ల బట్టలు ఉతకడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మీ శిశువు ఆరోగ్యం పట్ల ఎటువంటి అజాగ్రత్తలు తీసుకోకూడదు. మీ శిశువు దుస్తులను సరైన మార్గంలో ఎలా శానిటైజ్ చేయాలి మరియు ఉతకాలి అనే దానిపై కొన్ని సరైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
మీరు కొత్త పేరెంట్నా? మీ శిశువు దుస్తులను క్రిమిసంహారకం చేయడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి
మీరు మీ బిడ్డకు అన్నింటికన్నా ఉత్తమమైనదాన్ని ఇవ్వాలనుకుంటారు, ముఖ్యంగా వారి బట్టల విషయానికి వచ్చినప్పుడు. శిశువు దుస్తులను శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలను మేము మీకు అందిస్తున్నాము.
వ్యాసం నవీకరించబడింది
పంచుకోండి
సహజమైన డిటర్జెంట్ చేయండి
మీ శిశువు చర్మం సున్నితంగా ఉంటుంది మరియు అందువల్ల సహజమైన పదార్థాలతో తయారు చేసిన డిటర్జెంట్ తో వారి దుస్తులను ఉతకడం మంచిది. మొదట, మీ ఓవెన్ ను 200 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేసి, 6 కప్పుల బేకింగ్ సోడాను 20 నిమిషాలు కాల్చండి, అది చదునుగా మరియు గింజలుగింజలుగా మారుతుంది. బేకింగ్ సోడా చల్లబడిన తర్వాత, తురిమిన బేబీ సబ్బు యొక్క 3 బార్లను కలపండి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన కంటైనర్‌లో భద్రపరుచుకోండి మరియు అవసరమైనప్పుడు వాడండి.
ఫ్యాబ్రిక్ కండీషనర్ ఉపయోగించండి
మీ శిశువు బట్టలు ఉతకడానికి ఫాబ్రిక్ కండీషనర్ ఉపయోగించండి. ఇది మీ శిశువు బట్టల ఫైబర్లను సున్నితంగా చేస్తుంది మరియు వాటిని తాజాగా ఉంచుతుంది. మీ శిశువు యొక్క సున్నితమైన చర్మాన్ని రక్షించడానికి వారి దుస్తులను మృదువుగా ఉంచడం చాలా అవసరం.
ప్రకటన
పూర్తిగా ఉతకాలి
సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా మరియు వైరస్లు బట్టలపై కూడా జీవించగలవు. మీ శిశువు బట్టలు శుభ్రంగా మరియు సూక్ష్మక్రిమి రహితంగా ఉన్నాయని నిర్ధారించడానికి సరళమైన మార్గం వాటిని పూర్తిగా ఉతకడం. మొదట, చిట్కా 1 లో తయారుచేసిన డిటర్జెంట్ ఉపయోగించి ఏదైనా తడిసిన ప్రదేశాలను రుద్ది మరకలు లేకుండా చేయండి. చెంచా వెనుక భాగాన్ని ఉపయోగించి మరక ఉన్న ప్రదేశంలో రుద్దండి లేదా నేరుగా ఫాబ్రిక్ లోకి రుద్దండి. 2 నిమిషాలు వేచి ఉండి, మీరు మామూలుగానే ఉతకాలి. సూక్ష్మక్రిములను తొలగించడానికి లాండ్రీ శానిటైజర్ ఉపయోగించండి. దీని కోసం మీరు లైఫ్‌బాయ్ లాండ్రీ శానిటైజర్‌ను ఉపయోగించటానికి ప్రయత్నించవచ్చు. సూచనల కోసం ప్యాకేజీని ఎల్లప్పుడూ చదవండి మరియు ఉపయోగించే ముందు చిన్న భాగంలో పరీక్షించండి.
నాపీలను విడిగా ఉతకాలి
మీ శిశువు యొక్క వస్త్రం నాపీలను వారి ఇతర దుస్తులతో కలిపి ఉతకడం మానుకోండి. బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించడానికి వీటిని వేర్వేరు లోడ్లలో ఉతకడం ఎల్లప్పుడూ మంచిది.
మీ శిశువు దుస్తులను శుభ్రంగా ఉంచడానికి మరియు మీ బిడ్డ సంతోషంగా ఉండటానికి ఈ సులభమైన చిట్కాలను ఉపయోగించండి!
వ్యాసం మొదట ప్రచురించబడింది