మీరు మీ కారును ఉపయోగించడం ప్రారంభించినట్లయితే, వాహనం పక్కన శుభ్రమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని డం ఉండేలా చూడడం చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని మరియు మీ ప్రియమైనవారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కారు తరచుగా క్రిమిసంహారకమైందని మీరు నిర్ధారించుకోవాలి. ఇది కిరాణా షాపింగ్ కోసం లేదా కార్యాలయ రాకపోకలు కోసం అయినా, ప్రతి ఉపయోగానికి ముందు మరియు తరువాత క్రిమిసంహారకం చేయడం చాలా ముఖ్యం. మీ కారు శుభ్రంగా మరియు శానిటైజ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి.
లాక్డౌన్ తరువాత మీ ప్రైవేట్ వాహనాన్ని శుభ్రంగా మరియు క్రిమిసంహారకంగా ఎలా ఉంచాలో ఇక్కడ సూచించబడినది
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీరు కార్యాలయానికి వెళ్లడం ప్రారంభించాలనుకుంటున్నారా? ప్రజా రవాణాను ఉపయోగించే బదలు మీ స్వంత కారును ద్యోగం చేసే ప్రదేశానికి వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత మీ ప్రైవేట్ వాహనాలను శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకం చేయడం కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
వ్యాసం నవీకరించబడింది
పంచుకోండి
చర్య 1: ముందుగా శుభ్రం చేసే ప్రక్రియను అనుసరించండి
మీరు మీ కారును శుభ్రం చేయడానికి ముందు సాధారణంగా వదులుగా ఉండే టీ-షర్టు మరియు షార్ట్ లాంటివి ధరించవచ్చు. అయినప్పటికీ, కారు యొక్క ఉపరితలంతో మీ చర్మం అంటకుండా మిమ్మల్ని మీరు పూర్తిగా కప్పుకునేలా ఉండాలని మేము సలహా ఇస్తున్నాము. కలుషితమైన ఉపరితలాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఫేస్ మాస్క్‌తో పాటు మీ చేతులను శుభ్రపరచడం మరియు చేతి తొడుగులు ధరించాలని నిర్ధారించుకోండి. తగినంత రక్షణ కవచంలా ఉండడానికి ఫేస్ మాస్క్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
అవసరమైన అన్ని శుభ్రపరిచే వస్తువులను సేకరించి కారు దగ్గర ఉంచండి, తద్వారా మీరు శుభ్రపరిచే ప్రక్రియను ప్రారంభించిన తర్వాత మీ ఇంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదు. అదనపు మాస్క్‌ను కలిగి ఉండండి, ఒకవేళ మీరు ధరించిన మాస్క్ తడిగా ఉంటే మరొకటి మార్చుకోవాడానికి.
ప్రకటన
చర్య 2: ఇంటీరియర్స్‌ను క్రిమిసంహారకం చేయాలి
ఉపరితల దుమ్ము మరియు ధూళిని తొలగించడానికి ఇంటీరియర్లను వాక్యూమ్ చేయండి. ఇప్పుడు, స్టెయిన్ రిమూవింగ్ ఏజెంట్ ఉపయోగించి శుభ్రంగా తుడవండి. మీరు ఉపయోగించే క్లీనింగ్ ఏజెంట్ మీ కారు సీట్లపై ఉన్న అప్హోల్స్టరీ రకంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి లేబుల్లోని ఉత్పత్తి సూచనలను చదవండి. ప్రతివిధమైన అవాంఛనీయ చర్యలను నివారించడానికి మీరు ఎల్లప్పుడూ చిన్న మరుగైన ప్రదేశంలో శుభ్రపరిచే ఉత్పత్తులను పరీక్షించాలి. అయితే, కారు సీట్లను శుభ్రపరచడం మాత్రమే సరిపోదని దయచేసి గమనించండి. మీరు డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, గేర్ మరియు ఫుట్ మ్యాట్లను కూడా శుభ్రంగా తుడవాలి. విండ్‌స్క్రీన్, డోర్ హ్యాండిల్స్ మరియు కిటికీలను కూడా మీరు తుడిచారని నిర్ధారించుకోండి. ఒకసారి, మీరు మీ కారు లోపలి భాగాలను పూర్తిగా శుభ్రపరిచిన తరువాత ; ఇప్పుడు క్రిమిసంహారకం చేయవలసిన సమయం.
కాలుష్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎక్కువగా తాకే ఉపరితలాలను ఎలా క్రిమిసంహారకం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్టీరింగ్ వీల్, ఆర్మ్‌రెస్ట్, కప్ హోల్డర్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు డోర్ హ్యాండిల్స్ వంటి మీ కారు యొక్క అధికంగా తాకే ఉపరితలాలను శుభ్రపరచడానికి, డోమెక్స్ వంటి తగిన క్రిమిసంహారక స్ప్రేని ఉపయోగించండి. ఇది పలు ఉపయోగాల క్రిమిసంహారకం స్ప్రే, ఇది సూక్ష్మక్రిములను చంపుతుంది. ముందుగా చిన్న మరుగైన ప్రదేశంలో ఎల్లప్పుడూ పరీక్షించండి మరియు మొదట అనుకూలతను తనిఖీ చేసి శుభ్రం చేసుకోండి. ఉత్పత్తిపై సూచనలను చదవడం మర్చిపోవద్దు మరియు మృదువైన మరియు సుక్ష్మ రంధ్రముగల ఉపరితలాల కోసం ఇది సిఫార్సు చేయబడిందో లేదో తనిఖీ చేయండి.
దశ 3: వాహనం బయటి ప్రదేశాలను కడగాలి
సబ్బు నీటిలో ఒక స్పాంజిని ముంచి శుభ్రం చేయండి మరియు బయటి భాగాలను తుడవండి. నురుగు పొరను వదిలించుకోవడానికి ఒక గొట్టం పైపు ఉపయోగించండి. మీ కారుపై వాటర్‌మార్క్‌లను నివారించడానికి స్పాంజిని వృత్తాకార దిశల్లో రుద్దండి. శుభ్రమైన, నూలు వస్త్రాన్ని ఉపయోగించి అదనపు తేమను తుడిచివేయండి. ఇప్పుడు, మంచి నాణ్యమైన క్రిమిసంహారకం మందును ఉపయోగించి బాహ్య భాగాలను క్రిమిసంహారకం చేయండి.
దశ 4: మీ శుభ్రపరిచే సామగ్రిని పారవేయండి
మీ బట్టలు, చేతి తొడుగులు, మాస్క్ మరియు అన్ని ఇతర శుభ్రపరిచే పరికరాలను తీసుకొని వాటిని బాగా కడగండి. మంచి లాండ్రీ శానిటైజర్ లాంటి లైఫ్‌బాయ్ లాండ్రీ శానిటైజర్ వాడి శుభ్రంగా ఉంచమని మేము సూచిస్తున్నాము. మీరు పునర్వినియోగపరచలేని మాస్క్ ఉపయోగిస్తుంటే, దానిని బాధ్యతాయుతంగా పారేయడం ముఖ్యం. మీ ఫేస్ మాస్క్‌ను ఉపయోగించడానికి మరియు పారవేసేందుకు సరైన మార్గాన్ని ఇక్కడ తెలుసుకోండి.
సూచనల కోసం ప్యాక్ చదవండి మరియు అనుకూలతను తనిఖీ చేయడానికి మొదట చిన్న అస్పష్టమైన ప్రదేశంలో ఉత్పత్తిని ఎల్లప్పుడూ పరీక్షించండి. వాక్యూమ్ క్లీనర్ కూడా సరిగ్గా శానిటైజ్ చేయాలి. తర్వాత మంచిగా, షవర్ కింద హాయిగా స్నానం చేయండి.
ఇలా చేస్తే చాలు! లాక్డౌన్ తరువాత మీ ఉద్యోగం చేసే ప్రదేశాలకు వెళ్లడానికి ఈ చర్యలను పాటించండి, ఇవి సురక్షితంగా ఉండడానికి సహాయపడుతాయి.
మూలం:
వ్యాసం మొదట ప్రచురించబడింది