వైద్యులు మన ముందు వరసలో నిలబడే యోధులు మరియు వారిని సూక్ష్మక్రిముల నుండి లేదా సంక్రమణను కలిగించే క్రిములు నుండి రక్షించాల్సిన అవసరం ఉంది. అందుకే వారిని సందర్శించే ముందు ముందస్తుగా నిర్ణీత సమయాన్ని ఖరారు చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు సాధారణంగా మీ సాధారణ పరీక్షలు చేసే క్లినిక్ లేదా ఆసుపత్రికి వెళ్ళలేకపోతే, మీ వైద్యుడు మిమ్మల్ని వేరే క్లినిక్ లేదా ఆసుపత్రిలో కలవాలనుకోవచ్చు. మీరు బయలుదేరే ముందు ప్రదేశం మరియు సమయాలను తెలుసుకొండి.
అలాగే, మీ డాక్టర్ టెలి-సంప్రదింపులు ఇస్తారో లేదో తనిఖీ చేయండి. వర్చువల్ చెకప్ సాధ్యమైతే, లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే ముఖాముఖి పరస్పర చర్యలను నివారించడం మంచిది. అయినప్పటికీ, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని మీ డాక్టర్ సూచించినట్లయితే, మీరు మరియు మీ వైద్యుడి భద్రతను నిర్ధారించడానికి ఈ చిట్కాలను అనుసరించండి.
ఫేస్ మాస్క్ ధరించండి
మీరు బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు మీ మూతిని మరియు ముక్కును కప్పుకోవాలి. ఫేస్ మాస్క్‌ను ఎలా ఉపయోగించాలో మరింత తెలుసుకోండి. మీ నోరు మరియు ముక్కును సమర్థవంతంగా కప్పి ఉంచే ఫేస్ మాస్క్ ధరించండి. మాస్క్ యొక్క పట్టీలు వదులుగా లేదా అది చినిగిపోయి ఉంటే, దానిని వాడకండి, మరొకదాన్ని ఉపయోగించండి. దయచేసి మాస్క్ మీకు బాగా సరిపోతుందని మరియు తగిన రక్షణ కల్పిస్తుందని నిర్ధారించుకోండి. మీరు ప్రతి నిమిషాం మీ మాస్క్‌ని సర్దుబాటు చేసుకోవలసి వస్తే, మాస్క్ ధరించిన లాభం ఏది ఉండదు. ప్రతి సారి వాడిన తర్వాత మీరు మీ గుడ్డ మాస్క్‌లను ఉతుక్కోవాలి. మీరు పునర్వినియోగపరచలేని ముసుగులు ఉపయోగిస్తుంటే, మీరు వాటిని సురక్షితంగా మరియు శుభ్రమైన రీతిలో విసిరేయండి.
సామాజిక దూరాన్ని పాటించండి
క్లినిక్ లేదా ఆసుపత్రిలో చాలా మంది సందర్శకులు ఉండవచ్చు. ఆరోగ్య సంరక్షణ సలహాదారు ఇచ్చిన సూచనలు / అభ్యర్థనలను మీరు అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి. మీరు డాక్టర్ సందర్శనను ఒంటరిగా చేయగలిగితే కుటుంబ సభ్యుడిని వెంట తీసుకుని వెళ్ళకండి. ఆసుపత్రి / క్లినిక్‌లో ఉన్నప్పుడు, అందరి నుండి కనీసం 6 అడుగుల దూరం పాటించడానికి ప్రయత్నించండి. డాక్టర్ లేదా ఆసుపత్రి సిబ్బందిని అనవసరంగా తాకకండి. మీ పరీక్ష నివేదిక మరియు వైద్య చరిత్రను మీ వైద్యుడితో ఆన్లైన్లో పంచుకోండి. సాధ్యమైనంతవరకు, నగదు చెల్లింపులు చేయవద్దు; బదులుగా ఆన్లైన్ చెల్లింపులను చేయండి.
మీ చేతులు కడుక్కోవాలి
మీ సందర్శన సమయంలో మీరు తలుపుల గొళ్ళాలు మరియు ఎలివేటర్ బటన్ వంటి ఎక్కువగా తాకే ఉపరితలాలను తాకవలసి ఉంటుంది. మీతో హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్లండి. మీరు ఏదైనా వస్తువును తాకినట్లయితే, మీ చేతులను సబ్బు మరియు నీటితో కడగాలి లేదా హ్యాండ్ శానిటైజర్ వాడండి.
చక్కగా చేతులు శుభ్రపరచుకోవడాన్ని అలవాటు చేసుకుంటే మిమ్మల్ని సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. డాక్టర్ క్యాబిన్లోకి ప్రవేశించే ముందు మీ చేతులను శుభ్రపరిచేలా చూసుకోండి. క్లినిక్ లేదా హాస్పిటల్ మిమ్మల్ని అడిగే అన్ని నిబంధనలను పాటించండి. మీ భద్రత కోసం అవి ఏర్పాటు చేయబడ్డాయి. మీరు సందర్శన నుండి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బు మరియు గోరువెచ్చని నీటితో మీ చేతులను కడగాలి. బయటి నుండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు తీసుకోగల జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ఇది చదవండి.
మీ ఆరోగ్య పరీక్ష కోసం మీరు తదుపరిసారి మీ వైద్యుడిని సందర్శించినప్పుడు ఈ గైడ్‌ను వాడుకోండి.
మూలం:
https://patients.healthquest.org/how-to-safely-see-your-doctor-for-non-covid-19-medical-care/