ప్రకటన
Buy Domex

మీ శిశువు యొక్క స్కూల్‌ యూనిఫామ్‌ నుంచి ఆహార మరకలను తొలగించడం తేలిక పని!

ఈ సారి మీ పిల్లలు తమ యూనిఫాం అంతటా ఆహార మరకలతో స్కూలు నుంచి ఇంటికి వస్తే, భయపడకండి. కొన్ని సరళ చర్యలతో మరకలను పోగొట్టేందుకు ఈ గైడ్‌ మీకు సహాయపడుతుంది.

వ్యాసం నవీకరించబడింది

Removing Food Stains from Your Child’s School Uniform is Child’s Play!

మీరు మీ శిశువుకు రుచికరమైన లంచ్‌ ప్యాక్‌లను ఇస్తారు, కానీ వాళ్ళు తరచుగా స్కూల్‌ యూనిఫామ్‌ అంతటా ఆహార మరకలతో వస్తారు. కానీ చింతించకండి, ఆ మరకలను పోగొట్టుకోవడం సులభం.

మీ శిశువు యొక్క స్కూల్‌ యూనిఫామ్‌ నుంచి మొండి ఆహార మరకలను శుభ్రం చేసేందుకు ఇది సులభ మరియు ప్రభావవంతమైన పద్ధతి.

స్టెప్ 1:

సాధ్యమైనంత వెంటనే మరకలను తొలగించేందుకు మరకలు పడిన గార్మెంట్‌ భాగాన్ని చల్లని పడుతున్న నీటి కింద ఉంచండి. తదుపరి శుభ్రపరచే ప్రక్రియను ఇది సులభం చేస్తుంది.

స్టెప్‌ 2:

ప్రభావిత వస్త్రాన్ని సమతల ఉపరితలంపై ఉంచి బేకింగ్‌ సోడాను ఉదారంగా చల్లండి. మీరు మరకలకు సమానంగా ఆచ్ఛాదన కల్పించారని నిర్థారించుకోండి. సుమారుగా 10 నిమిషాల సేపు బేకింగ్‌ సోడాను అలా వదిలేయండి.

ప్రకటన

Buy Domex

స్టెప్‌ 3:

చెప్పిన సమయం అయిపోతే, పాత టూత్‌బ్రష్‌ తీసుకొని మరకలపై మెల్లగా రుద్దండి. ఈ పాటికి, అత్యధిక మరకలు తొలగిపోయివుంటాయి.

స్టెప్‌ 4: 

ఇప్పుడు, మరకలు పడిన భాగాన్ని చల్లని పడుతున్న నీటి కింద మళ్ళీ ఉంచి బాగా కడగండి.

స్టెప్‌ 5:

మరకలు మొండివి అయితే, మీకు ఇష్టమైన లిక్విడ్‌ డిటర్జెంట్‌ని తీసి దానిలోని కొద్ది మొత్తాన్ని గార్మెంట్‌ యొక్క మరకల భాగంపై పూయండి.

స్టెప్‌ 6:

దానిని గంట సేపు అలా ఉంచండి, తరువాత గార్మెంట్‌ని మీ వాషింగ్‌ మెషీన్‌లో వేయండి. మీ రెగ్యులర్‌ వాష్‌ సైకిల్‌ని రన్‌ చేయండి.

స్టెప్‌ 7:

గార్మెంట్‌ని బాగా గాలి వెలుతురు వచ్చేప్రాంతంలో ఆరబెట్టండి.

మీకు అర్థమై ఉంటుందనుకుంటా! తమ స్కూలు దుస్తులకు మరకలు అవుతాయనే చింత లేకుండా, మీ పిల్లలకు ఆహారంతో తీపి జ్ఞాపకాలు కలిగించండి! ఈ సారి మీరు మీ శిశువు యొక్క స్కూలు యూనిఫామ్‌ నుంచి ఆహార మరకలను తొలగించాలనుకున్నప్పుడు, ఈ క్లీనింగ్‌ పద్ధతిని పాటించండి. ఇది సరళమైనది మరియు ప్రభావవంతమైనది.

వ్యాసం మొదట ప్రచురించబడింది