పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్టడీ డెస్క్‌ల దగ్గరే ఎక్కువ సమయం గడుపుతారు. చదవడం, వ్రాయడం మరియు ఆటలు ఆడుకోవడం చేస్తుంటారు. ఆ చోటును శుభ్రంగా, సక్రమంగా మరియు శక్తి సామర్ధ్యాలకు ఉపయోగపడే విధంగా ఉంచడం మంచిది. ఇది పిల్లలు దృష్టి పెట్టడానికి, ఆలోచించే సామర్ధ్యతకు మరియు ఉత్పాదకతకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
మీరు ఉపయోగించగల కొన్ని సలహాలు ఇక్కడ సూచించబడ్డాయి
1) ఒక రంగును ఎంచుకోండి
మీ పిల్లలకు స్టడీ టేబులును ఎంచుకున్నప్పుడు, మీ పిల్లలు ఇష్టపడే రంగు ఉండే విధంగా చూసుకోవాలి. మీ పిల్లలకు ఇష్టమైన సూపర్‌హీరో థీమ్‌ను ఎంచుకోండి, ఆ ప్రదేశంలో స్టికర్లను అంటించాలి.
2) టేబుల్ మరియు చైర్ ఎంచుకోండి
మీ పిల్లలు పెన్నులు, పెన్సిళ్ళు, స్కెచ్ పెన్నులు మరియు వాటర్ కలర్లను వాడతారు మరియు స్టడి డెస్క్‌పై మరకలు పడే అవకాశం అధికంగా ఉంటుంది. మీరు ముదురు రంగుది ఎంచుకోమని మేము సలహా ఇస్తున్నాము, దానివల్ల మరకలను తేలికగా శుభ్రం చేసుకోవచ్చును మరియు ఇవి ప్రధానంగా కనిపించవు. ఇంకా మీ పిల్లలు కూర్చోవడానికి సౌకర్యవంతమైన చైర్ ఎంచుకోండి.
3) సహజమైన రీతిలో కాంతి వచ్చే చోటును ఎంచుకోవాలి
సహజమైన సూర్యకాంతి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తొంది, అందువల్ల, మీ పిల్లల స్టడి డెస్క్ పగటిపూట గరిష్ఠంగా సూర్యకాంతి పడే చోట వేయడం మంచి ఐడియా, ఉదా. ఒక కిటికీ దగ్గరగా లేదా మీ బాల్కనీకి దగ్గర. సాయంకాలం అయిన తరువాత డెస్క్‌పైన సర్దుబాటుచేయగల లైటును ఉంచాలి. మీ పిల్లలు నిర్దిష్టమైన పనులపై దృష్టి పెట్టడంలో ఈ లైటు మీ పిల్లలకు సహాయపడుతుంది.
4) నిల్వచేయగల సామర్థ్యం
మీ పిల్లల కోసం మీరు ఎంచుకున్న స్టడీ టేబుల్ స్టేషనరీ, స్టడీ మెటీరియల్ పెట్టుకోవడానికి అనువుగా ఉందని నిర్ధారించుకోవాలి. విభిన్న విషయాల కొరకు ప్రతి నోట్‌బుక్, టెక్స్ట్ బుక్, డ్రాయింగ్ ఫోలియో మరియు పైల్‌ను వాటికి నియమించిన రంగులతో ట్యాగ్ చేయవచ్చును.
మీ పిల్లలు శ్రద్ధ చూపేలా డెస్క్‌ను ఏర్పాటుచేయాలి. డెస్క్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాటుకు రంగులు దిద్దాలి. ప్రపంచ పటాన్ని, మీ పిల్లల డిఐవై క్రాఫ్ట్స్, ప్రేరణాత్మకమైన సందేశాలను లేదా పోస్టర్లను పెట్టాలి. పిల్లలను ఉత్సహపరచే విధంగా ఉండడానికి వ్యక్తిగత ఫోటో ఫ్రేమ్‌లను పెట్టవచ్చు. ఇక్కడ సూచించిన విషయాలు మీకు గైడ్‌లాగా ఉపయోగపడుతాయి అని భావిస్తున్నాం. మీ పిల్లల స్టడీ టేబులుకు సరైన అభిమతాలను చేయడానికి వీలవుగా ఉంటుంది.