Unilever logo

మీ కార్పెట్ నుంచి నెయిల్ పాలిష్ మరకలను తొలగించడానికి సులభమైన చర్యలు

అనుకోకుండా మీ ఖరీదైన స్టైలిష్ కార్పెట్ పై నెయిల్ పాలిష్ పడిందా, ఐతే భయపడాల్సిన అవసరం లేదు. మరకలను తొలగించి మరియు మీ కార్పెట్‌ క్షుణ్ణంగా శుభ్రం చేసుకునేందుకు ఇక్కడ ఇవ్వబడిన చర్యలను అనుసరించండి

వ్యాసం నవీకరించబడింది

Easy Steps to Bid Goodbye to Nail Polish Stains from Your Carpet

నెయిల్ పాలిష్ చేతి గోళ్ల పై చూడటానికి అందంగా ఉంటుంది. కానీ అదే నెయిల్ పాలిష్ పొరపాటున కార్పెట్ పై పడితే చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ కార్పెట్‌కు దూరంగా మీ గోళ్ళకు పాలీష్‌ చేసుకోమని సలహా, కాని ఎల్లవేళలా మీరు జాగ్రత్తగా ఉండలేరు కదా కాని ప్రమాద వశాత్తూ నెయిల్‌ పెయింట్‌ చిందితే, వెనువెంటనే చర్యను తీసుకోవాలి. ఎంత తొందరగా శుభ్రం చేయడం ప్రారంభిస్తే, అంత తక్కువ శ్రమ మీరు పడవలసి ఉంటుంది. 

మీ కార్పెట్  పై ఉన్న నెయిల్ పాలిష్ మరకలను పూర్తిగా తొలగించడానికి మేము సూచించే చర్యలను  అనుసరించండి. 

స్టెప్ 1. పేపర్ తువ్వాళ్లతో బ్లాట్ చేయండి

మీ కార్పెట్ పై నెయిల్ పాలిష్ మరకలను గుర్తించిన వెంటనే, దానిపై కాగితపు తువ్వాళ్లను కప్పాలి. నిదానంగా బ్లాట్ చేయాలి

స్టెప్ 2. తడిసిన ప్రాంతాన్ని గీరివేయండి

మీ నెయిల్‌ పెయింట్‌ ఎండిపోయిన మరకలను గీరడానికి ఒక బటర్‌ నైప్‌ లేదా చెంచాను ఉపయోగించాలి.  కార్పెట్ పై ఉన్న దారాలు పోకుండా సున్నితంగా తీసివేయాలి.

స్టెప్ 3 అసిటోన్ రుద్దాలి 

నెయిల్ పాలిష్ పడిన చోట చిన్న దూది ఉండ  తీసుకొని అసిటోన్ లో ముంచి మరక పై రుద్దాలి. కార్పెట్‌ నుండి పాలీష్‌ రావడం ఆగిపోయే దాకా  ఇలా 2-3 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అసిటోన్ మీ కార్పెట్ అందాన్నిపాడు చేసే అవకాశం ఉంది కాబట్టి,  అసిటోన్ తో మరక పై అద్దాలి. పెద్ద మొత్తంలో ఉపయోగించవద్దు

స్టెప్ 4.  క్లీనింగ్ ద్రావకాన్ని తయారుచేసుకోవాలి

ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లను తీసుకొని అందులో 4-5 చుక్కల తేలికపాటి డిటర్జెంట్ కలపాలి. బ్లీచింగ్ లక్షణాలు లేని డిటర్జెంట్ ను ఎంచుకొని కలుపుకోవాలి. 

స్టెప్ 5. మరకలను శుభ్రం చేయండి

 సిద్దం చేసుకున్న క్లీనింగ్ ద్రావకం లో మృదువైన స్పాంజిని నానబెట్టి, కార్పెట్ పై నెయిల్ పాలిష్ పడిన చోట స్పాంజితో మృదువుగా రుద్దాలి. కార్పెట్ పై దాక్కొని ఉన్న మరకలను సైతం ఈ ద్రావకం శుభ్రం  చేస్తుంది. ఇప్పుడు, స్వచ్ఛమైన నీటిలో కాటన్ బట్టని ముంచి డిటర్జెంట్‌పై అద్ది దానిని శుభ్రం చేయాలి

స్టెప్ 6: తేమను తుడిచి వేయాలి

తడిసిన ప్రదేశాలపై కాగితపు తువ్వాళ్లు పెట్టి కార్పెట్ పై ఉన్న తేమను ఆరె విధంగా చేయాలి. అవసరమయితే, ఇలా మరలా చేయాలి

సరే, మరకలను మీరు శుభ్రం చేసుకున్నారు కాబట్టి,  మీ చేతి గోళ్ల పై రెండవ కోటింగ్ నెయిల్ పాలిష్ కూడా వేసుకోవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది