పాతకాలపు గోడ గడియారం కేవలం సమయం తెలిపే ఓ వస్తువు మాత్రమే కాదు, ఇది మీ ఇంటిలో ఉండే అత్యంతంగా గర్వించ దగ్గ హోమ్ డెకోర్. ఇది పాతకాలపు గడియారం అయినప్పటికీ, ఇది మీ ఇంటికే రాజరిక ఠీవిని జోడిస్తుంది. బెడ్రూమ్, లివింగ్ రూమ్, బాల్కనీ వాల్ ఇలా ఎలాంటి పద్రేశమైన సరే దాని ప్రశస్తి కొనసాగుతుంది. అందుకే వీటిని శుభ్రం చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి శుభ్రం చేయాలి. మరి వీటిని ఎలా శుభ్రం చేయాలో మేము మీకు చెప్తాము.
- Home
- ఫ్లోర్ మరియు ఉపరితలం క్లీనింగ్
- మీ పాతకాలపు గోడ గడియారాన్ని శుభ్రం చేయడానికి ఒక క్రమమైన పద్దతి
మీ పాతకాలపు గోడ గడియారాన్ని శుభ్రం చేయడానికి ఒక క్రమమైన పద్దతి
మీ గోడపై వేలాడుతున్న మీ పాతకాలపు గడియారం మీ ఇంటికి పోల్చరాని ఆభరణంలాంటింది. మరి ఇలాంటి గడియారాం పదికాలల పాటు పదిలంగా ఉండాలంటే దానిని దశల వారీగా శుభ్రం చేస్తే దాని ప్రశస్తి అలాగే ఉంటుంది.
వ్యాసం నవీకరించబడింది
పంచుకోండి
దశ 1: ధూళిని తొలగించండి
ముందుగా ఒక నైలాన్ బ్రష్ తీసుకొని గడియారం పై వదులుగా ఉన్న దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకోవాలి.
దశ 2: మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడవండి
ఇప్పుడు మీ పాతకాలపు గడియారం మొత్తం ఉపరితలాన్ని మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించి తుడవండి.
దశ 3: మొండి మరకలను శుభ్రపరచండి
మీ గడియారం పై మొండి మరకలు ,కాల్చిన ధూళి ఉంటే, దాన్ని గుర్తించి శుభ్రం చేయాలి. దీని కోసం టూత్ బ్రష్‌ను నీటిలో ముంచి, మొండి మరకల పై మృదువుగా రుద్దాలి. బ్రష్ తో రుద్దేటప్పుడు ఆ మరకలు ఇతర భాగాలకు అంటకుండా బ్రష్ ను నీటిలో ముంచి మరకలు వదిలించుకొనే వరకు ఇలా చేయాలి.
దశ 4: గ్లాసును శుభ్రం చేయడం
గడియారం పై ఉన్న గ్లాస్ ను శుభ్రం చేయడానికి శుభ్రపరచే ద్రావకం సిద్దం చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని 1 చిన్న చెంచా డిష్ వాషింగ్ లిక్విడ్ ను జోడించాలి. ఈ ద్రావణంలో టూత్ బ్రష్‌ను ముంచి గ్లాస్ ఉపరితలం పై రుద్దాలి. గీతలు పడకుండా సున్నితంగా రుద్ది శుభ్రం చేయాలి.
దశ 5: మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడవండి
ఇప్పుడు, అదనపు తేమను మైక్రోఫైబర్ బట్ట తీసుకొని తుడుచుకోవాలి.
దశ 6: గాలికి ఎండబెట్టాలి
గడియారం త్వరగా ఆరిపోవడానికి ఫ్యాన్ కింద పెట్టండి.
మీ పాతకాలపు గడియారంలోని యాంత్రిక భాగాలను ఎట్టి పరిస్థితిలో శుభ్రపరచవద్దని గుర్తుంచుకోండి. గడియారం నిపుణుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
వ్యాసం మొదట ప్రచురించబడింది