Skip to content
hot-curry-stains-on-your-beautiful-wooden-table-relax-and-check-out-this-quick-fix
ఫ్లోర్ మరియు ఉపరితలం క్లీనింగ్

మీ అందమైన చెక్క బల్లపై వేడి కూరల మరకలు పడ్డాయా? చింతించకండి, వాటిని ఎలా పోగొట్టాలో తెలుసుకోండి!

మరకలను పోగొట్టడంలో గుర్తుంచుకోవాల్సిన ప్రధాన సూత్రం “వీలైనంత త్వరగా స్పందించడమే”.

ఒక చెక్క టేబుల్‌పై కర్రీ సాస్ పడినా, లేక దానిపై నూనె జిడ్డుతో ఉన్న కూరలు పడినా, మీరు బాధ పడాల్సిన అవసరం లేదు; రంగు పోగొట్టుకుని, వాసన వేసే చెక్కతోనే ఉండాల్సిన పని లేదు. ఈ సమస్యను తొలగించడానికి ఓ పరిష్కారం ఉంది.

దశ 1:

నియంత్రించండి – మొదట చేసే పనులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది, పేపర్ టవల్స్ ఉపయోగించి, కూరను త్వరగా పీల్చేసేలా చేయండి.

దశ 2:

మీ ద్రావకాన్ని సిద్ధం చేయండి – ఒక బక్కెట్‌లో 2 కప్పుల గోరువెచ్చని నీటిని పోయండి. ఈ నీటికి ¼వ వంతు వెనిగర్ మరియు 1 టేబుల్ స్పూన్‌తో విమ్ డిష్‌వాష్ లిక్విడ్‌ను తీసుకుని, ద్రావకం సిద్ధం చేయండి.

దశ 3:

తుడవండి – ఆ ద్రావకంలో ఒక తెల్లని స్పాంజ్‌ను ముంచి తడపండి. స్పాంజ్‌ను పిండడం ద్వారా అదనపు ద్రావకాన్ని పిండండి మరియు మరక పడిన ప్రాంతంలో రుద్దండి. మరక కనిపించకుండా ఉండేంతవరకూ ఈ చర్యను తిరిగి చేయండి.

దశ 4:

ఆరబెట్టండి – ఒక శుభ్రమైన బట్టను తీసుకుని నీటిలో తడపండి. దానితో ఉపరితలంపై రుద్దడం ద్వారా, చెక్క పొడిగా మారేలా చేయండి.



ఇది తేలిక మాత్రమే కాదు, చాలా తెలివైన పని కూడా. ప్రయత్నించండి.

ఉత్తమ కిటుకు: 

కొంత వుడ్ పాలిష్‌ను తీసుకుని ఉపరితలంపై రుద్దడం ద్వారా, దాని నునుపుదనం, మెరుపులను తిరిగి పొందవచ్చు.