కొన్ని సార్లు మీ వాషింగ్ మెషీన్‌లో ఉతకడం, పిండడం పూర్తయిన తరువాత, మీ దుస్తులపై అసంబద్ధమైన మరకలను గమనించి ఉండవచ్చు. దుస్తులను మృదువుగా ఉంచే పదార్ధాలు లేదా డిటర్జెంట్‌ల ద్వారా ఏర్పడిన అవశేషాల కారణంగా ఇలా జరుగుతుంది. మీరు తగిన చర్యలను తీసుకోకపోతే, ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఇలా దుర్వాసన వెలువరించే మరకలను నివారించడానికి మేము కొన్ని చిట్కాలను ఇస్తున్నాము.

1) మెషీన్‌లో నుంచి నీటిని మొత్తాన్ని వదిలేయండి. 3 కప్పుల వెనిగర్‌ను యంత్రంలో వేయండి మరియు వేడి నీటితో 10 నిమిషాల పాటు మెషీన్‌ను రన్ చేయండి.

2) మీరు ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్‌ను ఉపయోగిస్తున్నట్లు అయితే, వాటిని తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి, లేదా అసలు ఉపయోగించకపోవడమే అన్నిటి కంటే ఉత్తమమైన విషయం.

3) తెల్లని దుస్తులను వేడి నీటిలో సర్ఫ్ ఎక్సెల్‌తో ఉతకండి, ఇది తెలుపుదనాన్ని నిలబెట్టడానికి సహాయం చేస్తుంది.