ఇంటికి కావల్సిన అత్యుత్తమమైన వాటర్ ఫ్యూరిఫైర్లను ఎలా ఎంచుకోవాలి

ఎంచుకోవడానికి పలు రకాల వాటర్‌ ప్యూరిఫైయర్లు అందుబాటులో ఉండడంతో, మీకు కంగారు కలుగవచ్చును. మీ ఇంటికి అత్యుత్తమమైన వాటర్‌ప్యూరిఫైయర్‌ని ఎంచుకోవడంలో మీకు సహాయపడడానికి తేలికైన గైడ్‌ ఇక్కడ ఇవ్వబడినది

వ్యాసం నవీకరించబడింది

How to Select the Best Water Purifier for Your Home

అశుద్ధమైన నీటి నుండి మీ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ఉన్న అత్యుత్తమమైన మార్గాలలో ఒకటి, మంచి వాటర్‌ప్యూరిఫైయర్‌ని ఎంచుకోవడమే. మార్కెట్‌లో పలు రకాల వాటర్‌ప్యూరిఫైయర్‌ సిస్టమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి మీకు గందరగోళాన్ని కల్పించకుండా చూసుకోండి.

ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందుగా పరిగణించవలసిన కొన్ని సలహాలు ఇక్కడ సూచించబడ్డాయి

1) నీటి నాణ్యతను పరీక్షించాలి

వాటర్ ప్యూరిఫైయర్ కొనడానికి ముందు,  మన ఇంట్లోకి ఎలాంటి నీరు సరఫరా  అవుతుందో చూసుకోవాలి. దాని కోసం నీటి నాణ్యతను  పరీక్షించే నిపుణుడిని సంప్రదించాలి.

2) కలిగి ఉన్న మొత్తం కరిగిన ఘనపదార్థాలు

ఒకవేళ మీ ఇంటిలోని నీరు టిడిఎస్ స్థాయి అధికంగా ఉంటే  (> 500 పిపిఎమ్) RO +UV టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫైయర్‌ను ఎన్నుకోమని మా సలహా. అయితే టిడిఎస్ స్థాయి తక్కువగా ఉంటే (

3) నీటిని శుద్ధిచేసే సాంకేతిక పరిజ్ఞానాల రకం

మారుపేర్లతో మరియు ఆకర్షణీయమైన పేర్లతో మార్కెట్‌లో రకరకాలు లభిస్తున్నప్పుడు, ప్రతి టెక్నాలజీ ఉపయోగాన్ని అర్థం చేసుకోవడం కష్టం. మీరు పరిగణించడానికి ప్రాథమికంగా  మూడు రకాల శుద్ధిచేసే సిస్టమ్‌లు ఉన్నాయి.

రివర్స్ ఓస్మోసిస్ (RO)

 రివర్స్ ఓస్మోసిస్ నీటిలో కరిగిన లవణాలు, ఖనిజాలు, క్లోరమైన్లు, నత్రజనులు ఇతర భారీ లోహాలను భేద్యమైన పొర ద్వారా పంపడం ద్వారా ప్రభావవంతంగా తొలగిస్తాయి. 

అల్ట్రావైలెట్‌  (UV) మరియు అల్ట్రాఫైబ్రేషన్‌ (UF)

అశుద్ధమైన నీటి ద్వారా వచ్చే వ్యాధులకు కారణమయ్యే వ్యాధికారక సూక్ష్మజీవులను తొలగించడంలో UV (అల్ట్రావైలెట్‌) వాటర్ ప్యూరిఫైయర్లు ప్రభావవంతంగా పని చేస్తాయి.

UF(అల్ట్రాఫిల్ట్రేషన్) నీటి శుద్ధీకరణ వ్యవస్థ ఫైబర్ పొరను ఉపయోగిస్తుంది, ఇది నీటిలో పేరుకుపోయిన ఘనపదార్థాలను  సమర్ధవంతంగా తొలగిస్తుంది.

యాక్టివెట్డ్ కార్బన్ ఫిల్టర్

 యాక్టివెట్డ్ కార్బన్ ఫిల్టర్స్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే నీళ్లలో ఉండే క్లోరిన్, అస్థిర సేంద్రియ రసాయనాలు(VOC), పురుగుమందులు, ట్రైహలోమీథేన్(THM) సమ్మేళనాలు ఇతర మలినాలను తొలగిస్తుంది. అదనంగా శుద్ధి చేసే సిస్టములతో కలిసి ఇది పనిచేస్తుంది

ఈ సలహాలు, కొనుగోలు విషయంలో,  మీరు అత్యుత్తమమైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడతాయి. ఇంకా, సామర్ధ్యత మరియు మన్నిక లాంటి వాటిని కూడా పరిగణించాలి. ఇవి మీ కుటుంబ అవసరాలు మరియు రోజు వారీ అలవాట్లను బట్టి వేరేవేరేగా ఉంటాయి.

వ్యాసం మొదట ప్రచురించబడింది