ఉతికిన తరువాత మీ బట్టలను సువాసనతో ఉంచాలనుకుంటుంటే, మీరు ఆ పని ఎలా చేయాలో మీకు చెప్పేందుకు మేము ఇక్కడ ఉన్నాము. మీ బట్టలకు సువాసన వచ్చేలా కొన్ని చిట్కాలు ఇక్కడ సూచిస్తున్నాము.
మీ బట్టలకు ఎక్కువసేపు సువాసనను ఎలా జోడించాలో ఇక్కడ సూచిస్తున్నాము
మీ బట్టలు సువాసన వచ్చేలా చేసే అత్యుత్తమ మార్గం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? మీ బట్టలకు పెర్ఫ్యూమ్తో ఉంచే కొన్ని చిట్కాలను మేము ఇక్కడ ఇస్తున్నాము.
వ్యాసం నవీకరించబడింది
పంచుకోండి
1) ఫ్యాబ్రిక్ సాఫ్టనర్
ఫ్యాబ్రిక్ సాఫ్టనర్ ని ఉపయోగించడం మీ బట్టలకు కమ్మని సువాసన ఇచ్చేఅత్యుత్తమ మార్గాల్లో ఒకటి. మీరు వాషింగ్ మెషీన్‌ని ఉపయోగిస్తుంటే, ఉతికేటప్పుడు 1 పెద్ద చెంచా ఫ్యాబ్రిక్ సాఫ్టనర్ కలపండి. మీరు చేతులతో ఉతుకుతుంటే, మీరు బట్టలు ఉతికిన తరువాత, బక్కెట్ నీటికి 1/2 పెద్ద చెంచా ఫ్యాబ్రిక్ సాఫ్టనర్ కలపండి. మీ బట్టలను దీనిలో వేసి 15 నిమిషాలు వేచివుండండి. ఎక్కువగా ఉన్న నీటిని పిండేయండి మరియు ఆరిపోవడానికి వేలాడదీయండి.
2) సువాసనవచ్చే డిటర్జెంట్
మీరు బట్టలు ఉతికేందుకు మీరు సువాసన డిటర్జెంట్‌ని ఎంచుకోవచ్చు. మార్కెట్లో వివిధ ఎంపికలు లభిస్తున్నాయి. మీరు బట్టలు ఉతకడానికి ముందు, 1/2 కప్పు సువాసన డిటర్జెంట్‌ని కలిపి బక్కెట్ నీటిలో వాటిని నానబెట్టండి. తరువాత మామూలుగా ఉతకండి. మీ బట్టలు సువాసనతో ఉంటాయి!
3) వినిగర్
మీ బట్టలు సువాసనతో వచ్చేలా చేసే సహజ మార్గాన్ని మీరు చూస్తుంటే, వినిగర్ దీనికి మీ సమాధానం. మీరు బట్టలు ఉతకడానికి ముందు, బక్కెట్ గోరువెచ్చని నీరు తీసుకొని దానికి 1/2 కప్పు వినిగర్ కలపండి. మీ బట్టలను ఈ ద్రావణంలో 30 నిమిషాల సేపు నానబెట్టండి మరియు మామూలుగా చేసే మాదిరిగా ఉతకండి.
4) లావెండర్ నీళ్ళు
లావెండర్ నీళ్ళు ప్రభావవంతంగా మంచి సువాసనతో వచ్చేలా చేస్తాయి మరియు మార్కెట్లో సులభంగా లభిస్తున్నాయి. మీరు వాషింగ్ మెషీన్‌ని ఉపయోగిస్తుంటే, ఉతికేటప్పుడు 1 పెద్ద చెంచా లావెండర్ నీళ్ళు కలపండి. మీరు చేతులతో ఉతుకుతుంటే, మీరు బట్టలు ఉతికిన తరువాత బక్కెట్ నీటికి 1 పెద్ద చెంచా లావెండర్ నీళ్ళు కలపండి. మీ బట్టలు దీనిలో వేసి 15 నిమిషాల సేపు వేచివుండండి. ఎక్కువగా ఉన్న నీటిని పిండేసి ఎండలో వేలాడదీసి ఆరబెట్టండి. పెర్ఫ్యూమ్ని మీ బట్టలపై ఎక్కువ సేపు ఉండిపోయేలా చేసేందుకు, లావెండర్ నీటిలో 1 చిన్న చెంచా వనిల్లా సారం కలపండి.
ఈ చిట్కాలు పాటించండి మరియు ఎల్లవేళలా, ప్రతిసారి మీ బట్టలను తాజా వాసనతో ఉంచండి.
వ్యాసం మొదట ప్రచురించబడింది