అసలు వాసన రాకుండా అడ్డుకోగలగడమే అన్నింటి కంటే ఉత్తమమైన పని. అయితే, వాసన రాకుండా అన్నివేళలా అడ్డుకోవడం అసాధ్యమైన పనే. అందుకే మీ దుస్తులు తాజా పరిమళాలు వెదజల్లేలా చేయడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకోండి.
- దుస్తుల లోపలి భాగంలో వెనిగర్‌ను స్ప్రే చేసి, అలాగే కొన్ని గంటల పాటు హ్యాంగర్‌కు వేలాడదీయండి.
- మీ వాషింగ్ మెషీన్లో ఈ దుస్తులను ఒకసారి డ్రై స్పిన్ చేయండి. ఈ సమయంలో మీరు నిమ్మరసం చుక్కలను కొన్నింటిని వేయడం ద్వారా, చెడువాసనను దూరం చేయచ్చు.
- రాత్రి అంతా మీ దుస్తులను ఫ్రీజ్ చేయండి. మీరు తరువాత ఉతుకుతున్న సమయంలో ఇది దుర్గంధాన్ని పూర్తిగా నివారించగలుగుతుంది.
- ఒక పూర్తి కప్పు వెనిగర్‌ను వేసి, వాషింగ్ మెషీన్లో గోరువెచ్చని నీటిలో మీ దుస్తులను ఉతకండి. వాటిని వెంటనే ఆరేయడం మరచిపోకండి.
కొన్ని తాజా పరిమళాలు మరియు ఫ్రెష్ లాండ్రీని ఆస్వాదించండి.